Dihuli Massacre Case | దాదాపు 44 ఏళ్లనాటి దళితుల ఊచకోత కేసులో ఉత్తరప్రదేశ్‌లోని ప్రత్యేక కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. సామూహిక హత్యల కేసులో ముగ్గురు దోషులకు కోర్టు మరణశిక్ష విధించింది. ఇద్దరు దోషులకు ఒక్కొక్కరికి రూ.2లక్షలు, మరో దోషికి రూ.లక్ష జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. ఫిరోజాబాద్‌లోని జస్రానాలోని దిహులి గ్రామంలో 1981 నవంబర్ 24న జరిగిన 24 మంది దళితుల ఊచకోత కేసులో కోర్టు తీర్పును వెల్లడించింది. ఆ తర్వాత నిందితులను మైన్‌పురి జిల్లా జైటుకు తరలించారు.
ఈ కేసులో నిందితులైన కెప్టెన్ సింగ్, రాంసేవక్, రాంప్‌లను భారీ భద్రత మధ్య మెయిన్‌పురి జిల్లా నుంచి పోలీసులు ఉదయం 11.30 గంటలకు ఏడీజే స్పెషల్ రాబరీ ఇందిరా సింగ్ కోర్టులో హాజరు పరిచారు. విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ తరఫున రోహిత్ శుక్లా కోర్టు ఎదుట వాదనలు వినిపించారు. మారణహోమం కేసులో సాక్ష్యాలను పరిశీలించి.. నిందితులకు మరణశిక్ష విధించాలని కోర్టును కోరారు. కేసులో వాదనలు విన్న కోర్టు దోషులుగా తేలిన కెప్టెన్ సింగ్, రాంసేవక్, రాంపాల్‌కు మరణశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పును వెలువరించింది. న్యాయమూర్తి తీర్పును ప్రకటించిన తర్వాత ముగ్గురు దోషులు కోర్టులోనే విలపించారు. వారి బంధువులు సైతం కంటతడిపెట్టారు. కోర్టు నిందితులకు 30 రోజుల్లోగా మరణశిక్షకు వ్యతిరేకంగా హైకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. కోర్టు తీర్పు నేపథ్యంలో 14 రోజుల పాటు దోషులు జైలులోని క్వారంటైన్ బ్యారక్‌లో ఉండనున్నారు. సమయానికి ఆహారం తీసుకుంటున్నారా? నిద్రపోతున్నారా? అని పరిశీలిస్తారు.
ఫిరోజాబాద్ జిల్లాలోని జస్రానా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిహులి గ్రామంలో 24 మంది దళితులను ఊచకోత కోశారు. ఈ సంఘటన 1981 నవంబర్ 18న సాయంత్రం 6 గంటలకు జరిగింది. దోపిడీ దొంగలు సంతోష్, రాధే ముఠా ఆయుధాలతో దిహులి గ్రామంలోకి ప్రవేశించి.. ఓ కేసులో మహిళల, పిల్లలతో పాటు పలువురిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. అంతే కాకుండా దోపిడీకి పాల్పడ్డారు. ఈ ఘటనలో 24 మంది మరణించారు. ఈ ఘటనపై దిహులికి చెందిన లాయక్ సింగ్ 1981 నవంబర్ 19న జస్రానా పోలీస్ స్టేషన్లో దాఖలు చేశారు. రాధేశ్యామ్ అలియాస్ రాధే, సంతోష్ సింగ్‌తో పాటు 20 మందిపై జస్రానా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు మెయిన్‌పురి నుంచి అలహాబాద్ కోర్టులో కొనసాగింది. 19 అక్టోబర్ 2024న కేసును మళ్లీ మెయిన్‌పురి సెషన్ కోర్టుకు బదిలీ చేశారు. జిల్లా న్యాయమూర్తి ఆదేశాల మేరకు ప్రత్యేక రాబరీ కోర్టులో విచారణ జరిగింది. ఈ ఘటనలో 20 మందిపై కేసు నమోదవగా.. విచారణ సమయంలోనే 13 మంది మరణించారు.
మారణం హోమానికి పాల్పడ్డారంటూ గ్యాంగ్ లీడర్ సంతోష్, రాధేశ్యామ్.. ముఠా సభ్యులు కమ్రుద్దీన్, శ్యామ్‌వీర్, కున్వర్పాల్, రాజే, భూరా, ప్రమోద్ రాణా, మల్ఖాన్ సింగ్, రవీంద్ర సింగ్, దుర్గ్పాల్ సింగ్ కుమారుడు యుధిష్ఠిర్, మాన్షి సింగ్ కుమారుడు యుధిష్ఠిర్, మాన్షి సింగ్ కుమారుడు పంచమ్, లక్ష్మీ, ఇందల్, రుఖ్న్, జ్ఞానచంద్ర అలియాస్ గిన్నా, కప్తాన్ సింగ్, రాంసేవక్, రాంపాల్‌పై కేసు నమోదైంది. లక్ష్మీ, ఇందల్, రుఖ్న్, జ్ఞానచంద్ర అలియాస్ గిన్నా, కప్తాన్ సింగ్, రాంసేవక్, రాంపాల్ తప్ప అందరూ మరణించారు. కోర్టులో డెత్ రిపోర్ట్ సైతం దాఖలైంది. లక్ష్మీ, ఇందల్, రుఖ్న్, గిన్నా ఇప్పటికీ పరారీలో ఉన్నారు. ఈ కేసులో పలువురిని సాక్ష్యలుగా చేర్చారు. ఇందులో కుమార్ ప్రసాద్ సాక్ష్యం కీలకంగా మారింది. ఆయన ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. మారణహోమంపై ఆయన ఊచకోత, దోపిడీపై సాక్ష్యం అందించారు. ఈ ఘటన 1981 నవంబర్ 18న జరిగింది. దిహులిలో 24 మందిని అదే రోజు రాత్రి జస్త్రానా కోర్టులో కేసు నమోదైంది. 1982 ఫిబ్రవరి 26 వరకు ప్రధాన నిందితులు రాధే, సంతోష్ సహా 15 మంది నిందితుల అరెస్టు అయ్యారు. 1982 ఫిబ్రవరి 26న కోర్టులో చార్జిషీట్ దాఖలైంది. 1982 మే 13న కోర్టులో నిందితులపై అభియోగాలు మోపారు. 1982 మే 13న హైకోర్టు ఆదేశాల మేరకు కేసు ప్రయాగ్‌రాజ్ సెషన్ కోర్టుకు బదిలీ అయ్యింది. 19 అక్టోబర్ 2024న కేసును మళ్లీ మెయిన్‌పురి సెషన్ కోర్టుకు బదిలీ చేశారు. తాజాగా ముగ్గురు దోషులకు కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది.