వాసాలమర్రిని మార్చేస్తాం

- సీఎం దత్తత గ్రామానికి కొత్త రూపురేఖలు : కలెక్టర్
తుర్కపల్లి, జూన్ 25: త్వరలో వాసాలమర్రి గ్రామ రూపురేఖలు మారనున్నాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ పమేలాసత్పతి తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలంలోని వాసాలమర్రిలో కలెక్టర్ ఆధ్వర్యంలో శుక్రవారం గ్రామ అభివృద్ధి కమిటీలను ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. వాసాలమర్రిని సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడం గ్రామస్థుల అదృష్టమన్నారు. గ్రామ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎన్ని నిధులైన ఖర్చుచేసేందుకు సిద్ధ్దంగా ఉన్నారని చెప్పారు. అనంతరం గ్రామాభివృద్ధి కోసం ప్రధాన కమిటీతోపాటు హరితహారం, పారిశుద్ధ్యం-తాగునీరు, శ్రమదానం, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక వసతులు, మార్కెటింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. అభివృద్ధి కమిటీల సభ్యులు నిస్వార్థంగా సేవ చేయాలని కోరారు. ఈ సమావేశంలో డీఆర్డీవో ఉపేందర్‌రెడ్డి, సర్పంచ్ పోగుల ఆంజనేయులు, ఎంపీటీసీ సభ్యుడు పలుగుల నవీన్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

