న్యూఢిల్లీ: ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్‌కు చెందిన రఫేల్ యుద్ధ విమానాన్ని కూల్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్‌కు చెందిన కొన్ని శకలాల ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పీఐబీ ఫ్యాక్ట్ చెక్(PIB Fact Check) వివరణ ఇచ్చింది.
సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఫోటోలు గతంలో కూలిన మిగ్ 21 ఫైటర్ జెట్‌కు చెందినవని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పేర్కొన్నది. 2021లో పంజాబ్‌లోని మోగా జిల్లాలో మిగ్21 విమానం కూలిన దృశ్యాలు మీడియాలో వైరల్ అవుతున్నట్లు పీఐబీ తెలిపింది. ప్రో పాకిస్తానీ యూజర్లు పోస్టు చేస్తున్న మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని పీఐబీ పేర్కొన్నది. పాకిస్థాన్‌కు చెందిన ఐఎస్పీఆర్ విభాగం తప్పుడు సమాచారాన్ని చేరవేస్తున్నట్లు పీఐబీ ఆరోపించింది. భారతీయ యుద్ధ విమానాలను కూల్చివేసినట్లు, భారతీయ ఆర్మీ బేస్‌లపై దాడి చేస్తున్నట్లు వచ్చిన వార్తలను పీఐబీ ఖండించింది. భారతీయ సైనిక దళాలను తప్పుడు సమాచారంతో టార్గెట్ చేస్తున్నట్లు పీఐబీ తెలిపింది. ఇండియన్ బ్రిగేడ్ ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు, శ్రీనగర్ ఎయిర్‌బేస్‌పై దాడి జరిగినట్లు వస్తున్న వార్తలను ఇండియా ఖండించింది.
⚠️Propaganda Alert!
Beware of old images shared by pro-Pakistan handles in the present context!
An #old image showing a crashed aircraft is being circulated with the claim that Pakistan recently shot down an Indian Rafale jet near Bahawalpur during the ongoing #OperationSindoor… pic.twitter.com/LdkJ1JYuH0
— PIB Fact Check (@PIBFactCheck) May 7, 2025