న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో పెద్దలతో పాటు పిల్లల్లో కూడా హృద్రోగ సంబంధిత మరణాలు ఎక్కువయ్యాయి. ముందస్తుగా వ్యాధి లక్షణాలు గుర్తించకపోవడం ప్రతికూలంగా మారుతున్నది. అయితే చిన్న యూరిన్ టెస్ట్‌తో గుండె జబ్బులను గుర్తించవచ్చని పరిశోధకులు వెల్లడించారు. చాలాకాలంగా అధిక మోతాదులో యూరినరీ ఆల్బుమీన్ ఎక్సర్షన్ (యూఏఈ), సెరమ్ క్రెటినిన్ ఉన్న వారికి గుండె ఫెయిల్యూర్‌కు అధిక అవకాశాలున్నట్టు ఈ పరిశోధన వెల్లడించింది. 28 నుంచి 75 ఏండ్ల వయసున్న ఏడు వేల మందిపై 11 ఏండ్ల పాటు ఈ పరిశోధన చేశారు.