బెంగళూరు, జూలై 31 : కర్ణాటకలోని ధర్మస్థల కేసులో అధికారులకు మొదటి ఆధారం లభ్యమైంది. వందలాది మందిని హత్య చేసి ఈ టెంపుల్ టౌన్ చుట్టుపక్కల పాతిపెట్టారంటూ వచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తూ తవ్వకాలు జరుపుతున్న బృందానికి సైట్ నెంబర్ 6లో ఒక పాక్షిక అస్థిపంజరం అవశేషాలు లభించాయి. ఈ కేసు దర్యాప్తు చేపట్టిన తర్వాత అధికారులకు లభించిన మొదటి ఆధారం ఇది.
అస్థిపంజర అవశేషాలు బాగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్నాయి. ఘటనా స్థలిలో మరిన్ని ఆధారాలు సేకరించడానికి అధికారులు డాగ్ స్క్వాడ్‌ను కూడా రప్పించారు. పర్యావరణ పరిస్థితుల కారణంగా ఎముకలు చెల్లాచెదురుగా ఉండటంతో తవ్వకం కార్యకలాపాలను విస్తరించారు. కాగా, ఈ కేసుపై ఫిర్యాదు చేసిన పారిశుద్ధ్య కార్మికుడు తాను ఈ ప్రదేశంలో రెండు మృతదేహాలను ఖననం చేసినట్టు తెలిపాడు.
హైదరాబాద్, జూలై 31 (నమస్తేతెలంగాణ) : కర్ణాటక రాష్ట్రంలోని ధర్మస్థల ఆలయ ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.