ముంబై : యజువేంద్ర చహల్ భార్య, డ్యాన్సర్ ధనశ్రీ వర్మ చాలా రోజుల తర్వాత లేటెస్ట్ డ్యాన్స్ వీడియోతో (Viral Video) నెటిజన్ల ముందుకొచ్చారు. లాంగ్ గవాచ నుక్లియాస్ వెర్షన్‌కు డ్యాన్స్ చేసిన వీడియోను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేశారు. ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి ఏకంగా 24 లక్షల మంది వీక్షించారు.
బ్లాక్ క్రాప్ టాప్, షార్ట్స్ ధరించిన ధనశ్రీ ఈ వీడియోలో కిల్లర్ డ్యాన్స్ మూమెంట్స్‌తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆమె తన సూపర్ ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్‌తో దుమ్మురేపారు. ఆమె డ్యాన్స్ మూమెంట్స్‌పై కామెంట్స్ సెక్షన్లో యూజర్లు ప్రశంసలు గుప్పించారు.
వర్కింగ్ ఆన్ స్ట్రెంగ్త్ అండ్ సెలబ్రేషన్ అని వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ఆయుష్మాన్ ఖురానా, అథియా శెట్టి వంటి సెలబ్రిటీలు సైతం ఈ వీడియోను లైక్ చేశారు. కొరియాగ్రాఫర్తో పాటు డిజిటల్ కంటెంట్ క్రియేటర్ కూడా అయిన ధనశ్రీ 2020లో క్రికెటర్ యుజువేంద్ర చహల్‌ను వివాహం చేసుకున్నారు.
Read More