న్యూఢిల్లీ : పంజాబీ హిట్ సాంగ్ ధోల్ జగీరో దాకు ఓ పెద్దాయన డ్యాన్స్‌తో దుమ్మురేపిన వీడియో (viral video) ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. గురుగాం మాల్లో ఈ వీడియోను రికార్డు చేశారు. ఈ పాటకు ఆయన క్రేజీ స్టెప్స్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో జస్ట్ అనే అకౌంట్ షేర్ చేయగా ఏకంగా పది లక్షల మందికి పైగా వీక్షించారు. వీడియోలోని వృద్ధుడిని మోహన్ లాల్ దువాగా గుర్తించారు. మాల్లో చుట్టూ చేరిన జనాలు ప్రోత్సహిస్తుండగా పెద్దాయన పంజాబీ ట్రాక్‌కు హుషారైన స్టెప్స్‌తో ఆకట్టుకున్నారు.
దువా ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్‌తో అదరగొట్టాడని ఆయన ఎక్స్‌ప్రెషన్స్‌తో తెలిసిపోతోంది. ఇంటర్నెట్ దువా ఎనర్జీని ప్రశంసించింది. మీ భావోద్వేగాలను ప్రదర్శించడంలో ఎన్నడూ సిగ్గుపడకండని ఓ యూజర్ రాసుకురాగా, ఆ వయసులో తాను కూడా ఆయనలాగే డ్యాన్స్ చేయాలని కోరుకుంటున్నానని మరో యూజర్ కామెంట్ చేశారు.
Read More