ప్రయాగ్‌రాజ్: సాధారణంగా కన్నపేగుకు కష్టమొస్తే తల్లి విలవిల్లాడుతుంది. కొడుకు కష్టాన్ని తీర్చేందుకు తాను చేయదగిన ప్రయత్నాలన్నీ చేస్తుంది. అలాంటి కొడుకు చనిపోతే..! ఏకంగా తుపాకీ తూటాలకు బలైపోతే..! ఆ తల్లి వేదన వర్ణణాతీతం..! హృదయవిధారకం..! అలాంటిది ఒక తల్లి మాత్రం కొడుకు చావు వార్తను తేలిగ్గా తీసుకుంది. ఆమె కొడుకు చేసిన ఘనకార్యం ఆమెలోని కారుణ్యాన్ని కాఠిన్యంగా మార్చింది. ఓ గ్యాంగ్‌స్టర్ చేతికింది గ్యాంగ్‌తో కలిసి తన కొడుకు హత్యలు చేసేవాడని తెలుసుకుని హతాశురాలైంది. పోలీసులతో ఎన్కౌంటర్లో హతమైన తన కొడుకు శవాన్ని కూడా తాను తీసుకోబోనని తెగేసి చెప్పింది.
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన అతీక్ అహ్మద్ ఒక గ్యాంగ్‌స్టర్. అతనిపై ఎన్నో హత్యలు, హత్యాయత్నాలు, దోపిడీలు, దౌర్జన్యాలకు సంబంధించిన కేసులు ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్‌గా కొనసాగుతూనే రాజకీయాల్లో చేరిన అతీక్ అహ్మద్.. 1989 నుంచి 2004 వరకు ప్రయాగ్‌రాజ్ (పశ్చిమ) అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2004 నుంచి 2009 వరకు సమాజ్‌వాదీ పార్టీ నుంచి ఫూల్పూర్ ఎంపీగా లోక్‌సభకు ప్రాతినిథ్యం వహించాడు.
అయితే, 2005లో బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్‌ను హత్యచేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అతీక్ అహ్మద్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. ఈ క్రమంలోనే కేసులో ఉచ్చు బిగుస్తుండటంతో ఆ కేసులో సాక్షిగా ఉన్న ఉమేశ్ పాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 24న కిడ్నాప్ చేయించి, హత్య చేయించాడు. అతీక్ కుమారుడు అసద్, అసద్ స్నేహితుడు గులామ్ ఈ హత్యలో ప్రధాన పాత్ర పోషించారు. ఈ క్రమంలో వారి కోసం ముమ్మరంగా గాలిస్తున్న పోలీసులు గురువారం ఎన్కౌంటర్లో హతమర్చారు.
ఈ నేపథ్యంలో గులామ్ గురించి అతని తల్లి ఖుష్నుదాను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. తన కొడుకు గ్యాంగ్‌స్టర్‌తో కలిసి పనిచేస్తున్నాడని చనిపోయేవరకు తెలియదని ఆమె చెప్పింది. ఇంత చేసిన వాడి (కొడుకు గులామ్) శవాన్ని కూడా తాను పోలీసుల నుంచి తీసుకోబోనని ఆమె తెగేసి చెప్పింది. తీసుకుంటే వాడి భార్య తీసుకుంటుందేమోనని వ్యాఖ్యానించింది. కింది వీడియోలో ఖుస్నుదా వ్యాఖ్యలను మీరు కూడా వినవచ్చు.
#WATCH | Prayagraj, UP: “The action taken by the government is absolutely correct. All gangsters and criminals will take a lesson from this. I had no idea that he (my son) used to work for gangster Atiq Ahmed. I will not receive his body, maybe his wife will receive it,” says… pic.twitter.com/9oqwnwYd2i
— ANI UP/Uttarakhand (@ANINewsUP) April 14, 2023
ఇవి కూడా చదవండి..