బెర్లిన్:జర్మనీలోని బెర్లిన్ జూలో ఉన్న గొరిల్లా(Gorilla) 66వ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నది. ఆ గొరల్లా పేరు ఫతోవూ(Fatou). ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జూలలో ఉన్న గొరిల్లాలో ఇదే వృద్ధ జంతువు. సాధారణంగా గొరిల్లాల జీవితకాలం 45 నుంచి 50 ఏళ్లు మాత్రమే. కానీ బెర్లిన్ జూలో ఉన్న గొరిల్లా మాత్రం తన జీవితకాలాన్ని పొడిగిస్తోంది. ఇదో స్పెషల్ విషయమని ఆ జూ కీపర్ రూబెన్ గ్రాకి తెలిపారు.
ఏప్రిల్ 13న గొరిల్లా ఫతోవూ తన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంది. ఈ నేపథ్యంలో దానికి ఫ్రూట్ బాస్కెట్ ఇచ్చారు. ప్రపంచవ్యాప్తంగా సజీవంగా ఉన్న అత్యంత వృద్ధ గొరిల్లాకు దీనికి గుర్తింపు ఉన్నది. బర్త్డే డిన్నర్లో భాగంగా ఫలాలు, కూరగాయలు, వాటర్మెలన్ అందించారు.