Surendra Singh Yadav | న్యూఢిల్లీ : అసాధారణ రీతిలో చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేంద్ర సింగ్ యాదవ్‌ను డిప్యుటేషన్‌పై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)గా బదిలీ చేస్తూ కేంద్ర హోం శాఖ(ఎంహెచ్ఏ) మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఒక ఐపీఎస్ అధికారి ర్యాంకును తగ్గించి బదిలీ చేయడం ఇదే మొదటిసారి. వెంటనే కేంద్రంలో తన కొత్త పోస్టులో చేరాలని యాదవ్‌ను ఎంహెచ్ఏ ఆదేశించింది. ఐపీఎస్ అధికారుల పోస్టింగులు, నియామకాలలో కేంద్ర ప్రభుత్వ ఆధిపత్యాన్ని ఈ చర్య ప్రతిబింబిస్తోంది. అయితే అనూహ్యరీతిలో జరిగిన ఈ బదిలీని ఏప్రిల్ ఫూల్ ప్రాంక్‌గా పలువురు ఐపీఎస్ అధికారులు పొరబడ్డారు. డీజీపీగా పనిచేసిన ఐపీఎస్ అధికారి జూనియర్ స్థాయిలో డీఐజీగా కొత్త బాధ్యతలు చేపట్టడం కన్నా రాజీనామా చేయడమే ఉత్తమమని అధికారులు అభిప్రాయపడుతున్నారు.