న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్లో దగ్గు సిరప్ కాల్డ్రిఫ్ తాగి 20 మంది చిన్నారులు మృతి చెందిన క్రమంలో ఔషధ నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలను జారీ చేసింది.
అన్ని ఔషధ ఉత్పత్తుల పరీక్షలను కఠినతరం చేయాలని ఆదేశించింది. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం తనిఖీలు నిర్వహించకుండా ఒక్క బ్యాచ్ ఔషధం కూడా మార్కెట్కు పోరాదని పేర్కొంది. కాగా, మధ్యప్రదేశ్లో గత 24 గంటల వ్యవధిలో నాలుగు కొత్త మరణాలు చోటుచేసుకున్నాయి. పిల్లలకు ఇవ్వకూడని కొన్ని దగ్గు సిరప్లు ఇప్పటికీ అమ్ముడవుతున్నాయని దర్యాప్తులో గుర్తించారు.