న్యూఢిల్లీ: వాణిజ్య విమానాల పైలట్లకు నిర్వహించే వైద్య పరీక్షలపై పౌర విమానయాన డెరెక్టర్ జనరల్ (డీజీసీఏ) కొత్త ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి వారు ఎయిర్‌ఫోర్స్ బోర్డింగ్ సెంటర్లలో మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవాలని పేర్కొంది. దీనిపై పైలట్లు పలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇటీవల అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ఘోర ప్రమాదం, విధి నిర్వహణలో ఉండగా పైలట్లు కార్డియక్ అరెస్ట్‌కు గురి కావడం వంటివి పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ వైద్య పరీక్షల విషయంలో నిబంధనలు కఠినతరం చేసింది.
తాజా నిబంధనల ప్రకారం ఇక నుంచి పైలట్లు ఇండియన్ ఐఏఎఫ్ బోర్డింగ్ సెంటర్లో మాత్రమే వైద్య పరీక్షలు చేయించుకోవాలనే నిబంధనను డీజీసీఏ తెచ్చింది. కాగా, మిలిటరీ పైలట్లకు నిర్వహించే వైద్య పరీక్షల స్థాయి కఠినంగా ఉంటుందని, వాటిని వాణిజ్య విమానాలను నడిపై పైలట్లకు వర్తింపచేయడం సరికాదని విమానయాన సంస్థలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.