న్యూఢిల్లీ: విమాన నిర్వహణకు సంబంధించి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై, కోల్కతా విమానాశ్రయాల్లో బుధవారం చేపట్టిన తనిఖీల్లో భద్రతా లోపాలు, ఉల్లంఘనలు గుర్తించామని డీజీసీఏ తాజాగా వెల్లడించింది. వీటిపై ఢిల్లీ, ముంబై విమానాశ్రయ నిర్వాహకులకు డీజీసీఏ ఏడు రోజుల సమయమిచ్చింది.
ఓ ఎయిర్పోర్టులో అరిగిపోయిన టైర్ల కారణంగా ఓ దేశీయ విమానం నిలిచిపోయినట్టు డీజీసీఏ తెలిపింది. మరో విమానాశ్రయంలో రన్వే సెంటర్ లైన్ మార్కింగ్ చెరిగిపోయినట్టు వెల్లడించింది.