ముంబై,: టర్కీ ఎయిర్‌లైన్స్ విమానాలను మరో మూడు నెలలు నడపడానికి లీజును పొడిగిస్తూ డీజీసీఏ శుక్రవారం ఇండిగోకు అనుమతినిచ్చింది. ఇండిగో లీజుకు తీసుకున్న రెండు బోయింగ్ 777 విమానాలను ఆగస్టు 31 వరకు నిర్వహించుకోవచ్చునని, ఇదే ఆఖరి పొడిగింపు అని, అంతేకాకుండా మూడు నెలల్లోగా టర్కీ ఎయిర్‌లైన్స్‌తో సంబంధాలను రద్దు చేసుకోవాలని ఆదేశించింది.
ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండాఈ చర్య తీసుకున్నట్టు డీజీసీఏ తెలిపింది. ఇటీవల భారత్-పాక్ మధ్య చోటుచేసుకున్న దాడుల్లో పాక్‌కు తుర్కియే మద్దతిచ్చింది.