డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లోని కేదార్నాథ్ ఆలయానికి ( Kedarnath Temple ) భక్తుల తాకిడి రోజురోజుకు పెరుగుతున్నది. గత కొన్ని రోజులుగా కేదార్‌నాథుని దర్శనానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు. 2013లో భారీ వరదలు మిగిల్చిన విషాదం తర్వాత భక్తుల సంఖ్య ఈ స్థాయిలో ఉండటం ఇదే తొలిసారి అని ఆలయ అధికారులు చెబుతున్నారు. నాటి వరద విపత్తు అనంతరం ఈ పుణ్యక్షేత్రం వద్ద అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, అప్పటిలా వరదలు వచ్చినా ప్రాణనష్టం లేకుండా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ మధ్యకాలంలో కేదార్నాథ్ పరిసరాల్లో పలు నిర్మాణ పనులు చేపట్టారని, దాంతో ఆకస్మిక వరదల భయం పోయిందని భక్తులు చెబుతున్నారు. పునర్నిర్మాణ పనులు పూర్తయితే ఆకస్మిక వరదలు వచ్చినా పెద్దగా ప్రమాదమేం ఉండదని అంటున్నారు.
Uttarakhand | A number of redevelopment works have been undertaken at a rapid pace at Kedarnath in the last few years as a result of that a large number of devotees are coming to visit the shrine, says another devotee pic.twitter.com/yD03NqTvKX
— ANI (@ANI) November 3, 2021
Uttarakhand | Devotees visiting Kedarnath shrine say major re-development works undertaken at Kedarnath after 2013 floods
— ANI (@ANI) November 3, 2021
Almost all facilities are available for devotees here. Accommodation facilities should be increased, says a devotee. pic.twitter.com/blqIeByfr2