Fadnavis And Uddhav | ఒకే విమానంలో ప్రయాణించిన ఫడ్నవీస్, ఉద్ధవ్.. షిండే ఏమన్నారంటే?
Fadnavis And Uddhav | మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించారు. శుక్రవారం వారిద్దరూ ముంబై నుంచి నాగ్‌పూర్‌కు విమానంలో కలిసి ప్రయాణించడం రాజకీయ చర్చకు దారితీసింది.
ముంబై: మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, శివసేన (యూబీటీ) అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఒకే విమానంలో ప్రయాణించారు. (Fadnavis And Uddhav) శుక్రవారం వారిద్దరూ ముంబై నుంచి నాగ్‌పూర్‌కు విమానంలో కలిసి ప్రయాణించడం రాజకీయ చర్చకు దారితీసింది. డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే దీనిపై స్పందించారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ చాలా తెలివైన వ్యక్తి అని, కుట్రలు పన్నే స్నేహితుడు ఎంత ప్రమాదకరమో ఆయనకు బాగా తెలుసని అన్నారు.
కాగా, 2019లో బీజేపీ, అవిభక్త శివసేన ఒకే విమానంలో ప్రయాణించాయని, అయితే అప్పుడు ఆయన (ఉద్ధవ్) వేరే విమానంలో ప్రయాణించి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని ఏక్నాథ్ షిండే ఆరోపించారు. ఆరుగురు తిరుగుబాటు పార్టీ ఎంపీల నియోజకవర్గాల్లో ఉద్ధవ్ ఠాక్రే సభలు నిర్వహించడంపై కూడా ఆయన స్పందించారు. శివసేన (యూబీటీ) అధినేతను ఇంటి నుంచి బయటకు రప్పించిన ఘనత తనదేనని షిండే అన్నారు.
మరోవైపు తన రాజకీయ ప్రత్యర్థి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి విమానంలో ప్రయాణించడంపై ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో మాట్లాడారు. తామిద్దరం చాలా ఉన్నత స్థాయిలో చర్చలు జరిపినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో దాని ఫలితం తెలుస్తుందని ఠాక్రే అన్నారు.
అయితే ఫడ్నవీస్, ఉద్ధవ్ కలిసి ఒకే విమానంలో ప్రయాణించడంలో ఎలాంటి రాజకీయ ప్రాముఖ్యత లేదని బీజేపీ కొట్టిపారేసింది. పార్టీలకు అతీతంగా స్నేహపూర్వక, వ్యక్తిగత సంబంధాలను నాయకులు కొనసాగిస్తారని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

