ముంబై : 2019లో మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సూచించారని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis) చెప్పారు. ముంబైలో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఫడ్నవీస్ మాట్లాడుతూ శివసేన తమ సహజ మిత్రపక్షమని, అజిత్ పవార్ రాజకీయ మిత్రుడని అన్నారు.
పాలనలో బాధ్యతలు పంచుకోవడం వల్ల నిర్వహణ మెరుగవుతుందని, మహారాష్ట్ర ప్రభుత్వంలో అజిత్ పవార్ చేరికను ఉద్దేశించి పేర్కొన్నారు. అజిత్ పవార్ చేరిక తమ బలాన్ని పెంచిందని వ్యాఖ్యానించారు.
అజిత్ పవార్ రాకతో బాధ్యత పెరగలేదని, బాధ్యత పంచుకున్నట్టు అయిందని ఫడ్నవీస్ చెప్పుకొచ్చారు. మహారాష్ట్రలో రానున్న లోక్సభ ఎన్నికల్లో తాము 40కిపైగా స్ధానాలు గెలుచుకుంటామని ఆయన పేర్కొన్నారు.
Read More :
Vande Bharat | వందేభారత్ స్లీపర్ కోచ్.. ఫొటోలు చూశారా..?