ముంబై: జూన్ 5(నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో అధికార ఎన్డీయే కూటమి మహారాష్ట్రలో ఘోర పరాభావాన్ని మూటగట్టుకుంది. దీంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేయనున్నట్టు దేవేంద్ర ఫడ్నవీస్ ప్రకటించారు.
ప్రభుత్వం నుంచి వైదొలిగి పార్టీ కోసం పనిచేసేందుకు అనుమతించాలని హైకమాండ్‌ను అభ్యర్థించనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా జరిగిన రైతు ఆందోళనలు, ఉద్యమం ఇక్కడి రైతుల్ని ప్రభావితం చేసిందని, వారు కమలం పార్టీకి వ్యతిరేకంగా ఫలితాల్ని ప్రభావితం చేశారని అన్నారు. రాజ్యాంగాన్ని బీజేపీ మారుస్తుందని కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు.