Food Safety | బెంగళూరు: కర్ణాటకలో ఐస్‌క్రీముల్లో డిటర్జెంట్ పౌడర్, కూల్ డ్రింకులో ఫాస్ఫరిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనిక పదార్థాలను కలుపుతున్నట్టు అధికారుల తనిఖీల్లో బయటపడింది. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న ఐస్ క్రీమ్, కూల్ డ్రింక్ తయారీ యూనిట్లపై కర్ణాటక ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అధికారులు దాడులు నిర్వహించారు.
మొత్తం 220 దుకాణాలలో తనిఖీలు నిర్వహించారు. 97 దుకాణాలకు నోటీసులు అందచేశారు. ఖర్చును తగ్గించుకోవడానికి స్వచ్ఛమైన పాలకు బదులుగా డిటర్జెంట్, యూరియా, గంజి వంటి పదార్థాలతో తయారుచేసే సింథటిక్ పాలను ఐస్‌క్రీమ్ తయారీలో ఉపయోగిస్తున్నట్టు బయటపడింది.