Viral News | మద్యం మత్తులో ఇద్దరు ఏఆర్ కానిస్టేబుళ్లు వీరంగం సృష్టించారు. వెజిటేరియన్ హోటల్ (vegetarian hotel)కి వెళ్లి నాన్‌వెజ్ కావాలంటూ సిబ్బందితో గొడవకు దిగారు. ఈ ఘటన చెన్నై (Chennai) శివారు తాంబరం (Tambaram) సమీపంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఇద్దరు సాయుధ రిజర్వ్ పోలీసు కానిస్టేబుళ్లు (armed reserve police constables) సివిల్ డ్రెస్‌లో తాంబరం సమీపంలోని పుదువంచెరి (Puduvanchery)లో గల ఓ శాకాహార హోటల్‌కు వెళ్లారు. చికెన్ రైస్ కావాలంటూ సిబ్బందిని డిమాండ్ చేశారు. అయితే, ఇది శాకాహార హోటల్ అని ఇందులో కేవలం వెజిటేరియన్ మాత్రమే ఉంటుందని సిబ్బంది తెలిపారు. అయితే, ఎగ్ శాకాహారమే కద.. ఎగ్ రైస్ తీసుకురామని పట్టుబట్టారు. అందుకు హోటల్ సిబ్బంది నిరాకరించడంతో కానిస్టేబుళ్లు వారితో గొడవకు దిగారు. ఈ ఘటనపై హోటల్ సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
అక్కడికి చేరుకున్న పోలీసులు సదరు కానిస్టేబుళ్లను స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. అనంతరం ఇద్దరినీ హెచ్చరించి వదిలిపెట్టారు. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో తాంబరం పోలీసులు ఆ ఇద్దరు ఏఆర్ కానిస్టేబుల్లపై చర్యలు తీసుకున్నారు.