Delta Airlines | న్యూఢిల్లీ: పావురాల కారణంగా ఓ విమానం రెండుసార్లు నిలిపివేయాల్సి వచ్చింది. ఈ ఘటన మాడిసన్, విస్కాన్సిన్కు వెళ్తున్న డెల్టా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఫ్లైట్-2348లో జరిగింది. కాసేపట్లో విమానం బయలుదేరుతుందనగా క్యాబిన్లో ఓ పావురాన్ని ప్రయాణికుడు గుర్తించాడు. వెంటనే విమానం సిబ్బందికి తెలిపాడు. దీంతో కొంతసేపు విమానాన్ని నిలిపివేశారు.
గ్రౌండ్ సిబ్బంది వచ్చి, ఆ పావురాన్ని బయటకు పంపించారు. ఇక విమానం టేకాఫ్‌కు సిద్ధమవుతుండగా, మరో పావురం క్యాబిన్లో ఎగురుతూ కనిపించింది. దీంతో మరోసారి ఫ్లైట్‌ను వెనక్కి మళ్లించారు. వెంటనే విమానాన్ని నిలిపివేసిన సిబ్బంది రెండో పావురాన్ని కూడా బయటకు సురక్షితంగా తీసుకెళ్లారు. 56 నిమిషాల ఆలస్యం అనంతరం విమానం బయల్దేరింది.