Amit Shah on Kashmir | కేంద్ర పాలిత ప్రాంతం జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా క్లారిటీ ఇచ్చారు. జమ్ముకశ్మీర్‌కు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత రాష్ట్ర హోదా పునరుద్ధరణ, అటుపై నియోజకవర్గాల పునర్విభజన చేపడతామని శనివారం తెలిపారు.
2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే 370 అధికరణాన్ని రద్దు చేసిన తర్వాత తొలిసారి ఆయన కశ్మీర్‌లోయలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా యూత్ క్లబ్స్ సభ్యులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అయితే 370 అధికరణం పునరుద్ధరణ సాధ్యం కాదని తేల్చి చెప్పారు.
Interacting with members of Youth Clubs of Jammu and Kashmir in Srinagar. Watch live! https://t.co/4o61gl726T
— Amit Shah (@AmitShah) October 23, 2021
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు చేదు గుళిక వేయక తప్పదన్నారు. 370 అధికరణం రద్దు తర్వాత 2019 ఆగస్టు ఐదో తేదీ నుంచి కశ్మీర్‌లోయలో కర్ఫ్యూ, ఇంటర్నెట్, మొబైల్ సేవలను తాత్కాలికంగా నిలిపివేయడాన్ని అమిత్‌షా సమర్థించుకున్నారు. అంతకుముందు ఆయన కశ్మీర్ లోయలో భద్రతా పరిస్థితులపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.