e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, January 23, 2022
Home News తీహార్‌లో జైలులో ఎక్స్‌రే బాడీ స్కానర్లు

తీహార్‌లో జైలులో ఎక్స్‌రే బాడీ స్కానర్లు

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని అత్యంత భద్రతతో కూడిన తీహార్‌ జైలు ఆవరణలోకి వస్తువులు, ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్‌లను అక్రమంగా తరలించకుండా అడ్డుకునేందుకు రెండు ఎక్స్‌-రే ఆధారిత మానవ శరీర స్కానర్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. రెండు ఫుల్-బాడీ స్కానర్లను కొనుగోలు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మూడు నెలల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని డైరెక్టర్‌ జనరల్‌ (జైళ్లు) సందీప్‌ గోయల్‌ తెలిపారు. తీహార్ జైలులో ఖైదీలకు సౌకర్యాలు కల్పిస్తూ అధికారులు పట్టుబడుతున్న నేపథ్యంలో భద్రతను పటిష్టం చేస్తున్నది.

ఖైదీలకు ఒకటి, మరోవిధంగా ప్రయోజనాలు పొడగించినందుకు జైలులోని మూడు డజన్లకుపైగా అధికారులు గడిచిన ఆరు నెలల్లో పట్టుబడ్డారు. యూనిటెక్‌ మాజీ ప్రమోటర్లు అజయ్‌ చంద్ర, సంజయ్‌ చంద్ర, మల్టీ మిలియనీర్‌ సుకేష్‌ చంద్రశేఖర్‌ జైలులో అనేక గాడ్జెట్ల వినియోగించినట్లు ఆరోపణలున్నాయి. బాడీ స్కానర్‌లను కొనుగోలు చేసేందుకు ముంబైలోని అటామిక్‌ ఎనర్జీ రెగ్యులేటరీ బోర్డ్‌ అనుమతి అవసరం కాగా.. దీనికి ఆమోదం తెలిపినట్లు డీజీ తెలిపారు.

- Advertisement -

అయితే జైలులో త్వరలోనే పరికరాలు అందుబాటులో ఉంటాయని, బాడీ స్కానర్లు కాకుండా ఖైదీలపై నిఘా ఉంచేందుకు తమ జైళ్లలో 7వేలకుపైగా కెమెరాలను ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ప్రతి జైలులో కనీసం 500-600 కెమెరాలుంటాయని. సీసీటీవీల ఫుటేజీ నెల వరకు ఉంటుందని డీజీ పేర్కొన్నారు. ఖైదీలు మొబైల్‌ ఫోన్లు వినియోగించడం తీవ్ర ఆందోళన కలిగిస్తుండగా.. మొబైల్‌ సిగ్నల్‌ను పరిమితం చేసేలా మూడు కొత్త టవర్లను ఏర్పాటు చేయనున్నట్లు డీజీ వివరించారు.

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement