Atishi Marlena : ఢిల్లీ మంత్రి, ఆమ్ఆద్మీ పార్టీ (AAP) సీనియర్ నాయకురాలు అతిషి మర్లినాకు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీచేసింది. జూన్ 29న కోర్టు ముందు విచారణకు హాజరుకావాలని కోర్టు ఆ సమన్లలో పేర్కొంది. ఢిల్లీ బీజేపీ మీడియా విభాగం హెడ్ ప్రవీణ్ శంకర్ కపూర్ వేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు.. అతిషికి నోటీసులు ఇచ్చింది.
ఆప్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నదని, డబ్బు ఆశ చూపి పార్టీలోకి ఆహ్వానిస్తోందని గతంలో అతిషి ఆరోపించారు. దాంతో అతిషి ఆరోపణలు పూర్తిగా నిరాధారమని, ఆమె వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను మసకబార్చేలా ఉన్నాయని ప్రవీణ్ పరువునష్టం దావా వేశారు.
ఇదే కేసులో ప్రవీణ్ శంకర్ కపూర్.. ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. అయితే అతిషికి సమన్లు జారీచేసిన కోర్టు కేజ్రీవాల్ విషయంలో మాత్రం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.