న్యూఢిల్లీ, జూలై 23 : ఇటీవల ఏదో కారణంతో భర్తలను హతమారుస్తూ కొందరు మహిళలు వార్తల్లో నిలుస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఢిల్లీలో కరెంట్ షాకిచ్చి భర్తను భార్య చంపిన ఉదంతం మరువక ముందే ఇప్పుడు మరో దారుణం వెలుగుచూసింది. తనను సంతృప్తి పరిచేలా పడక సుఖం అందించడం లేదన్న కోపంతో ఒక మహిళ భర్తను పొడిచి చంపింది. పైగా అతను ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించాడని నమ్మించడానికి ప్రయత్నించింది.
పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. 29 ఏండ్ల ఫజానా ఖాన్ ఆదివారం కత్తిపోటు గాయాలతో ఉన్న 32 ఏండ్ల భర్త మహమ్మద్ షాహిద్ అలియాస్ ఇర్ఫాన్‌ను తీసుకుని నిహల్ విహార్ ప్రాంతంలోని సంజయ్ గాంధీ దవాఖానకి వచ్చింది. తన భర్త కత్తితో పొడుచుకుని ఆత్మహత్యా యత్నం చేసుకున్నాడని డాక్టర్లకు తెలిపింది. అనుమానం వచ్చిన వారు వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చారు.