లక్నో: ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేయడంపై ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) స్పందించారు. కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. సిసోడియా అరెస్ట్‌పై ఢిల్లీ ప్రజలు బదిలిస్తారని, 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిస్తారని అన్నారు. సోమవారం ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ఢిల్లీ విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిన మనీష్ సిసోడియాను కేంద్ర ప్రభుత్వం అరెస్ట్ చేయడం దారుణమని పేర్కొన్నారు. ఆయనను అరెస్ట్ చేయడం ద్వారా చదువుకే కాదు, ఢిల్లీ పిల్లల భవిష్యత్తుకు కూడా వ్యతిరేకమని బీజేపీ రుజువు చేసిందని విమర్శించారు. ‘దీనిపై ఢిల్లీ ప్రజలు తప్పక స్పందిస్తారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో బీజేపీని ఓడిస్తారు’ అని అఖిలేష్ యాదవ్ హిందీలో ట్వీట్ చేశారు.
మరోవైపు అఖిలేష్ యాదవ్ పార్టీ సమాజ్‌వాదీ (ఎస్పీ) కూడా మనీష్ సిసోడియా అరెస్ట్‌ను ఖండించింది. ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి క్లిష్టమైన సామాజిక, ఆర్థిక సమస్యల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఆరోపించింది. అందుకే ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారని ట్విట్టర్లో విమర్శించింది. ‘ధరల పెరుగుదల, నిరుద్యోగం, ప్రభుత్వ ఆస్తుల అమ్మకాల నుంచి దృష్టిని మరల్చడానికే ప్రతిపక్ష నాయకులను బీజేపీ అరెస్టు చేస్తోంది. అణచివేత ద్వారా ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలనుకుంటోంది’ అని హిందీ ట్వీట్లో మండిపడింది.
दिल्ली में शिक्षा के क्षेत्र में क्रांतिकारी बदलाव लानेवाले मनीष सिसोदिया जी को गिरफ़्तार करके भाजपा ने साबित कर दिया है कि भाजपा शिक्षा ही नहीं बल्कि दिल्ली के बच्चों के भविष्य के ख़िलाफ़ भी है। दिल्ली की जनता इसका जवाब अगले लोकसभा चुनाव में भाजपा को सातों सीटें हराकर देगी।
— Akhilesh Yadav (@yadavakhilesh) February 27, 2023
समाजवादी पार्टी दिल्ली के डिप्टी सीएम श्री मनीष सिसोदिया जी की गिरफ्तारी की कड़ी निंदा करती है।
सरकारी संपत्तियों को बेचने,महंगाई और बेरोज़गारी जैसे मुद्दों को दबाने के लिए विपक्षी नेताओं को जबरन गिरफ्तार करवा रही भाजपा।
लोकतंत्र को खत्म करना चाहती है दमनकारी भाजपा सरकार।
— Samajwadi Party (@samajwadiparty) February 26, 2023