Delhi Water Crisis | ఢిల్లీ వాసులు నీటి కష్టాలు పడుతున్నారు. చాలాప్రాంతాలు నీటి కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ క్రమంలో ఢిల్లీ జలవనరుల శాఖ మంత్రి అతిషి సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీలో నీటి సమస్య పెంచేందుకు పైప్‌లైన్‌ను ధ్వంసం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దాంతో ఇవాళ దక్షిణ ఢిల్లీలో 25శాతం నీటి కొరత ఏర్పడిందన్నారు. ఈ మేరకు ఢిల్లీ పోలీస్ కమిషనర్‌కు ఆమె లేఖ రాశారు. ఢిల్లీలోని ప్రధాన నీటి పైపులైన్లకు భద్రత కల్పించాలని కోరారు.
ఆదివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్రమైన వేడికాలులు వీస్తున్నాయని.. నీటి కొరత సైతం ఉందన్నారు. ఈ క్రమంలో నీటి పైప్లైన్లను పగులగొట్టి కొరతను మరింత తీవ్రతరం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని తెలుస్తోందన్నారు. దక్షిణ ఢిల్లీలోని సరఫరా పైప్‌లైన్‌లో నిన్న భారీ లీకేజీ ఏర్పడిందని.. ఈ విషయం తెలుసుకున్న తమ బృందం.. మరమ్మతుల కోసం ఓ టీమ్‌ని పంపగా.. చాలా పెద్ద బోల్టులు కోసి ఉన్నట్లుగా గుర్తించారన్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన పైపులైన్లకు పోలీసుతో రక్షణ కల్పించాలని కమిషనర్‌కు లేక రాసినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి సౌరభ్ భరద్వాజ్‌కు మాట్లాడుతూ కొద్దిరోజుల ఢిల్లీలో లీకేజీలు ఉన్నాయంటూ కొందరు నిర్దిష్ట వ్యక్తులు పలు వీడియోలను వైరల్ చేశారన్నారు. లీకేజీ సహజమని తాను అనుకోనని.. కొందరు కావాలని లీకేజీలకు కారణమవుతున్నారన్నారు. నిన్న దక్షిణ ఢిల్లీలో పైపులు కట్టే నట్లు, బోల్ట్‌లు కోసి కనిపించాయన్నారు. వాటిని ఎవరు కట్ చేశారని.. దాంతో దక్షిణ ఢిల్లీలో నీళ్లు లేవన్నారన్నారు. పైప్లైన్ల ధ్వంసం చేసేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని.. ప్రజలు సైతం నిఘా వేసి ఉంచాలన్నారు.
मैंने दिल्ली पुलिस कमिश्नर को पत्र लिख कर आग्रह किया है कि दिल्ली के मेन वाटर पाइपलाइन नेटवर्क को पुलिस द्वारा सुरक्षा दी जाये। https://t.co/ktVOzu943y pic.twitter.com/u4P7b1P7f2
— Atishi (@AtishiAAP) June 16, 2024