Vistara Flight | విమానంలో బాంబు ఉందంటూ కొందరు ఆకతాయిలు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడుతున్న ఘటనలు ఇటీవలే కాలంలో ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. దీని వల్ల సిబ్బందితోపాటు, ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. తాజాగా ఢిల్లీ నుంచి శ్రీనగర్ వెళ్తున్న విమానానికి (Delhi-Srinagar Flight) బాంబు బెదిరింపులు (Bomb Threat) రావడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
సుమారు 177 మంది ప్రయాణికులతో విస్తారా ఎయిర్‌లైన్స్‌కు (Vistara Flight) చెందిన UK-611 విమానం ఢిల్లీ నుంచి శ్రీనగర్ బయల్దేరింది. అయితే గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ ద్వారా విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. ఫోన్ కాల్‌తో విమాన సిబ్బంది, ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. విమానం శుక్రవారం తెల్లవారుజామున 12:10 గంటల సమయంలో శ్రీనగర్ విమానాశ్రయంలో (Srinagar Airport) సురక్షితంగా ల్యాండ్ అయ్యింది.
వెంటనే అధికారులు రంగంలోకి దిగి ప్రొటోకాల్‌ను అనుసరించి విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే తనిఖీల్లో వారికి ఎలాంటి అనుమానాస్పద వస్తువూ, పేలుడు పదార్థాలు కనిపించలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు. ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు చెప్పారు. మరోవైపు బాంబు బెదిరింపు కాల్ నేపథ్యంలో శ్రీనగర్ విమానాశ్రయంలో సుమారు రెండు గంటల పాటు విమాన రాకపోకలను అధికారులు నిలిపివేశారు. ప్రస్తుతం అన్ని విమాన సర్వీసులు ప్రారంభమైనట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
Dehradun | గంగోత్రి మార్గంలో వాహనాలపై పడ్డ బండరాళ్లు.. ఒకరు మృతి
Ivanka Trump | పోర్న్ స్టార్ కేసులో దోషిగా తేలిన ట్రంప్.. ఇవాంక భావోద్వేగ పోస్ట్