Ivanka Trump | పోర్న్ స్టార్ కేసులో దోషిగా తేలిన ట్రంప్.. ఇవాంక భావోద్వేగ పోస్ట్
Ivanka Trump | శృంగార తార స్టార్మీ డేనియల్ (Stormy Daniels)తో అక్రమ సంబంధం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) దోషిగా తేలిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ (Ivanka Trump) భావోద్వేగానికి గురయ్యారు.
Ivanka Trump | శృంగార తార స్టార్మీ డేనియల్ (Stormy Daniels)తో అక్రమ సంబంధం కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (Donald Trump) దోషిగా తేలిన విషయం తెలిసిందే. స్టార్మీ డేనియల్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్‌హట్టన్ కోర్టు జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. ఈ కేసులో నమోదైన అన్ని ఆరోపణలు రుజువైనట్లు న్యూయార్క్ కోర్టు తేల్చింది. దాదాపు 34 అంశాల్లో ఆయనను దోషిగా నిర్ధరించింది. ఈ నేపథ్యంలో ట్రంప్ దోషిగా తేలడంతో ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ (Ivanka Trump) భావోద్వేగానికి గురయ్యారు. ఈ మేరకు తన తండ్రితో ఉన్న చిన్ననాటి ఫొటోను సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఆ ఫొటోకు ‘లవ్ యూ డాడ్’ అంటూ హార్ట్ ఎమోజీతో క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్‌గా మారింది.
పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చేందుకు బిజినెస్ రికార్డులను తారుమారు చేసినట్లు ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు చెల్లించారు. అయితే ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన వ్యాపార ఖాతాలను మార్చేశారు. ఆ కేసులో కొన్ని రోజుల నుంచి కోర్టు విచారణ జరిగింది. దోషిగా తేలిన ట్రంప్‌కు.. జూలై 11వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు.
ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. జూలై 11వ తేదీన తుది తీర్పు ఉంటుందని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. ఈ కేసులో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇవాళ మన్‌హట్టన్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ తప్పుపట్టారు. జ్యూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని, నిజమైన తీర్పు నవంబర్ 5వ తేదీన జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో తెలుస్తుందని ట్రంప్ అన్నారు.
Also Read..
Donald Trump: డోనాల్డ్ ట్రంప్ దోషి.. జూలై 11న తుది తీర్పు
PM Modi | ద్రవపదార్థాలే ఆహారం.. 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ డైట్
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

