PM Modi | ద్రవపదార్థాలే ఆహారం.. 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ డైట్
PM Modi | వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ కేవలం లిక్విడ్ డైట్ (liquid diet)ను పాటించనున్నారు.
PM Modi | సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తమిళనాడులోని కన్యాకుమారికి వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ (Vivekananda Rock Memorial) వద్ద సుదీర్ఘ ధ్యానం చేస్తున్నారు. గురువారం సాయంత్రం 6:45 గంటల నుంచి ధ్యానం చేయడం మొదలు పెట్టారు. సుమారు 45 గంటల పాటు మోదీ ధ్యానం చేయనున్నారు.
ఇక ఈ 45 గంటలూ మోదీ కేవలం లిక్విడ్ డైట్ (liquid diet)ను పాటించనున్నారు. కొబ్బరి నీళ్లు, ద్రాక్ష రసం, ఇతర ద్రవ పదార్థాలను మాత్రమే స్వీకరించనున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా మెడిటేషన్ సందర్భంగా మోదీ మౌనంగా ఉంటారని, ధ్యాన మందిరం దాటి బయటకు అడుగు పెట్టరని జాతీయ మీడియా వెల్లడించింది. మరోవైపు కాషాయ దుస్తులు ధరించి ప్రశాంత వాతావరణంలో మోదీ ధ్యానం చేస్తున్న వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. మోదీ పర్యటన నేపథ్యంలో అక్కడ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
ఎన్నికల ప్రచారం అనంతరం ప్రధాని ఆధ్యాత్మిక యాత్రలు చేస్తున్న విషయం తెలిసిందే. ఐదేళ్ల కిందట 2019లో ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే కేదార్నాథ్ సందర్శించారు. 2014లో ఆయన మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహరాజ్‌కు సంబంధించిన ప్రతాప్‌గఢ్‌కు వెళ్లారు. ప్రధాని ఈసారి కన్యాకుమారిని ఎంచుకున్నారు. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం పంజాబ్‌లో తన ఎన్నికల ప్రచారాన్ని ముగించుకున్న మోదీ.. సరాసరి ప్రత్యేక హెలికాప్టర్లో కన్యాకుమారి చేరుకున్నారు. ముందుగా శ్రీ భగవతీ అమ్మన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఓ పడవలో బయలు దేరి సముద్రం మధ్యలో ఉన్న శిలాస్మారకాన్ని చేరుకున్నారు. అక్కడ రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. అనంతరం వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించి ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు.
Also Read..
PM Modi | సాధువు అవతారమెత్తి.. ప్రశాంత వాతావరణంలో మోదీ ధ్యానం.. వీడియోలు
Amit Shah | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అమిత్ షా దంపతులు
Air Hostess | రహస్య భాగాల్లో దాచి బంగారం స్మగ్లింగ్.. ఎయిర్‌హోస్ట్ అరెస్ట్
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jamia Millia Islamia | 14వ రోజుకు జామియా విద్యార్థుల నిరాహార దీక్ష.. విద్యార్థి సంఘం ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్
Health Tips | మందులో కూల్ డ్రింక్స్ కలుపుకుని తాగుతున్నారా.. అయితే మీ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నట్టే..!
Judge Awarded 23 Death Sentences | 6 నెలల్లో 23 మరణశిక్షలు విధించిన న్యాయమూర్తి.. కుటుంబ కోర్టుకు బదిలీ
Iran-US | మాపై మళ్లీ దాడి చేసినా మా విధానం మారదు.. అమెరికాకు మరోసారి స్పష్టం చేసిన ఇరాన్
KCR | కేసీఆర్ మళ్లీ సీఎం కావాలి.. పాదయాత్ర చేసి కలిసిన యువకుడు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

