Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Miami Airport | అమెరికా (USA) లో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. శుక్ర, శనివారాల్లో విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనను మరువకముందే శనివారం రాత్రి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టార్మాక్‌పై రెండు విమానాలు ఢీకొన్నాయి.
Miami Airport : అమెరికా (USA) లో విమానాల రాకపోకలు నిలిచిపోవడంతో శుక్రవారం తీవ్ర గందరగోళం నెలకొన్నది. శుక్ర, శనివారాల్లో విమానాశ్రయాల్లో లక్షలాది మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. ఈ ఘటనను మరువకముందే శనివారం రాత్రి మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలోని టార్మాక్‌పై రెండు విమానాలు ఢీకొన్నాయి. రన్‌వేపై మలుపు తిరుగుతున్న ఒక విమానం రెక్క కొన వెనుకనున్న విమానం ముక్కుకు తగిలింది.
శనివారం రాత్రి 9:15 గంటల సమయంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పనామా సిటీ నుంచి 166 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో వచ్చిన కోపా ఎయిర్‌లైన్స్ బోయింగ్ 737 విమానం రెక్క కొన.. ఎయిర్‌పోర్టు టాక్సీవేలపై కదులుతున్న యూపీఎస్ బోయింగ్ 767 కార్గో విమానం ముక్కును ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారని కోపా ఎయిర్‌లైన్స్ ఆదివారం వెల్లడించింది. వారు చికిత్స పొందుతున్నారని ప్రాణాపాయం లేదని తెలిపింది. ఈ ఘటన జరిగినందుకు తాము చింతిస్తున్నామని పేర్కొన్నది.
JUST IN: UPS Boeing 767 collides with Copa Airlines 737 while taxiing at Miami International Airport in Florida, according to local radio station WMEN.
“Yeah, we went too far and he clipped us with the wing,” according to ATC audio. https://t.co/ogPvmAIhfA
— AZ Intel (@AZ_Intel_) November 15, 2026
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tirumala | తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ..నిన్న ఒక్కరోజే 83,670 మంది దర్శనం
Jagtial Hospital | పని చేయని ఎమర్జెన్సీ పరికరాలు.. జగిత్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
Ram Gopal Varma | ‘రామాయణం 2’ కలెక్షన్లు పార్ట్1 కంటే పదింతలు ఎక్కువ ఉంటాయి: రామ్ గోపాల్ వర్మ
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

