Donald Trump: డోనాల్డ్ ట్రంప్ దోషి.. జూలై 11న తుది తీర్పు
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్.. 34 నేరాభియోగాల్లో దోషిగా తేలారు. ఓ పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్‌హట్టన్ కోర్టు జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో ఓ మాజీ దేశాధ్యక్షుడు.. ఏదైనా నేరంలో దోషిగా తేలడం ఇదే మొదటిసారి.
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump).. 34 నేరాభియోగాల్లో దోషిగా తేలారు. ఓ పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చిన కేసులో మన్‌హట్టన్ కోర్టు జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చింది. అమెరికా చరిత్రలో ఓ మాజీ దేశాధ్యక్షుడు.. ఏదైనా నేరంలో దోషిగా తేలడం ఇదే మొదటిసారి. పోర్న్ స్టార్‌కు డబ్బులు ఇచ్చేందుకు బిజినెస్ రికార్డులను తారుమారు చేసినట్లు ట్రంప్‌పై నేరాభియోగాలు నమోదు అయ్యాయి. మాజీ అటార్నీ మైఖేల్ కోహెన్ ద్వారా ట్రంప్ పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్‌కు డబ్బులు చెల్లించారు. అయితే ఆ విషయాన్ని కప్పిపుచ్చేందుకు ట్రంప్ తన వ్యాపార ఖాతాలను మార్చేశారు. ఆ కేసులో కొన్ని రోజుల నుంచి కోర్టు విచారణ జరిగింది. దోషిగా తేలిన ట్రంప్‌కు.. జూలై 11వ తేదీన శిక్షను ఖరారు చేయనున్నారు.
ఈ ఏడాది జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ తరపున ట్రంప్ పోటీ పడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ మన్‌హట్టన్ కోర్టు ఇచ్చిన తీర్పును ట్రంప్ తప్పుపట్టారు. జూలై 11వ తేదీన తుది తీర్పు ఉంటుందని జడ్జి జువాన్ మెర్చన్ తెలిపారు. అయితే ఈ కేసులో ట్రంప్‌కు జైలు శిక్ష లేదా జరిమానా పడే అవకాశాలు ఉన్నాయి. జ్యూరీ తీసుకున్న నిర్ణయం అవమానకరమని, కానీ నిజమైన తీర్పు నవంబర్ 5వ తేదీన జరగనున్న దేశాధ్యక్ష ఎన్నికల్లో తెలుస్తుందని ట్రంప్ అన్నారు.
ట్రంప్ తరపున అటార్నీ టాడ్ బ్లాంకే వాదించారు. అయితే ఈ కేసులో న్యాయవాది టాడ్ మళ్లీ కోర్టులో అప్పీల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం.. ఏదైనా కేసులో దోషిగా తేలిన వ్యక్తి దేశాధ్యక్ష ఎన్నికల్లో పాల్గొనేందుకు ఎటువంటి ఆటంకం లేదు. ఒకవేళ ట్రంప్‌కు శిక్ష పడితే, ఆ సమయంలో ఆయన ఓటు వేయవచ్చా లేదా అన్న అంశంపై క్లారిటీ లేదు. ప్రస్తుతం ఫ్లోరిడా నివాసి అయిన ట్రంప్‌కు అక్కడే ఓటు ఉన్నది. ఒకవేళ ఎన్నికలు జరిగే లోపు ఆయన శిక్ష కాలం ముగిస్తే, అప్పుడు ట్రంప్ ఓటు వేసే ఛాన్సు ఉంటుంది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

