e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home News ఢిల్లీలో 3 నెల‌ల క‌నిష్ఠానికి క‌రోనా కేసులు

ఢిల్లీలో 3 నెల‌ల క‌నిష్ఠానికి క‌రోనా కేసులు

ఢిల్లీలో 3 నెల‌ల క‌నిష్ఠానికి క‌రోనా కేసులు

న్యూఢిల్లీ: దేశ రాజ‌ధాని ఢిల్లీలో క‌రోనా కేసుల సంఖ్య భారీగా త‌గ్గింది. తాజాగా గ‌డిచిన 24 గంట‌ల్లో కేవ‌లం 381 కేసులు మాత్ర‌మే న‌మోద‌య్యాయి. 34 మంది మృత్యువాత ప‌డ్డారు. 1189 మంది కోలుకున్నారు. మార్చి 9వ తేదీ త‌ర్వాత కేసుల సంఖ్య ఇంత త‌క్కువ‌గా రావ‌డం ఇదే తొలిసారి. శ‌నివారం 414 కేసులు న‌మోదు కాగా.. ఆ సంఖ్య మ‌రింత త‌గ్గింది. ఇక పాజిటివిటీ రేటు 0.5 శాతానికి ప‌డిపోయింది. శ‌ని, ఆదివారాల్లో మొత్తం 76,857 టెస్టులు చేశారు.

దీంతో ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కూ మొత్తం టెస్టుల సంఖ్య 1,97,58,315గా ఉంది. ప్ర‌స్తుతం ఢిల్లీలో 5889 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసులు సంఖ్య త‌గ్గుతుండ‌టంతో సోమ‌వారం నుంచి ఢిల్లీలో ఆంక్ష‌ల‌ను సడిలిస్తున్న విష‌యం తెలిసిందే. స‌రి, భేసి సంఖ్య‌లో దుకాణాలు తెర‌వ‌డానికి అనుమ‌తించారు. మెట్రో కూడా 50 శాతం సామ‌ర్థ్యంతో న‌డ‌వ‌నుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఢిల్లీలో 3 నెల‌ల క‌నిష్ఠానికి క‌రోనా కేసులు

ట్రెండింగ్‌

Advertisement