IMD | 32 సంవత్సరాల తర్వాత ఢిల్లీలో అత్యధిక వర్షాపాతం.. భారీగా తగ్గిన ఉష్ణోగ్రతలు
Delhi Sees Highest January Rain In 32 Years | దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది.

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో జనవరిలో శనివారం వరకు దాదాపు 70 మిల్లీమీటర్ల వర్షాపాతం నమోదైంది. గత 32 సంవత్సరాల్లో జనవరిలో వర్షాపాతం నమోదవడం ఇదే తొలిసారని భారత వాతావరణ శాఖ తెలిపింది. శనివారం రాత్రి 9.30 గంటల వరకు ఢిల్లీలో 69.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని ఐఎండీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 1989 జనవరిలో 79.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఆ తర్వాత వర్షాపాతం ఎక్కువగా నమోదవడం ఇదే మొదటిసారని చెప్పారు.
నగరంలో వర్షం కురవడంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు భారీ తగ్గి 14.7 డిగ్రీలకు చేరగా.. సగటు కంటే ఏడు డిగ్రీలు తక్కువగా నమోదైందని, ఈ సీజన్లో ఇదే తక్కువని అధికారులు తెలిపారు. పశ్చిమ అవాంతరాల కారణంగా పంజాబ్, హర్యానా, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఉత్తర రాజస్థాన్‌లో ఆదివారం వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఆదివారం పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని, ఆకాశం మేఘావృతమై ఉంటుందని పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

