న్యూఢిల్లీ: భారతీయ వస్త్రధారణలో వచ్చారని ఓ జంటను ఢిల్లీలోని ఓ రెస్టారెంట్లోకి అనుమతించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఇటీవల స్థానిక పిఠాంపుర మెట్రోస్టేషన్ సమీపంలోని ఓ రెస్టారెంట్లో భోజనం చేసేందుకు వెళ్లిన జంటకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఇదే విషయాన్ని సద రు జంట సోషల్‌మీడియాలో పెట్టారు. అందులో తాము భారతీయ వస్త్రధారణలో వెళ్లామని, ఆ సమయంలో అంతా పాశ్చా త్య వస్త్రధారణలో ఉన్నారని, తమను సిబ్బంది లోపలికి అనుమతించలేదని తెలిపారు.
దీనిపై ఢిల్లీ ప్రభుత్వం స్పందించి, ఈ విషయం సీఎం రేఖాగుప్తా దృష్టికి వెళ్లిందని, వెంటనే ఘటనపై విచారణకు ఆదేశించినట్టు మంత్రి కపిల్ శర్మ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఢిల్లీలో ఇలాంటి వాటిని ఆమోదించబోమని పేర్కొన్నా రు. దీనిపై వెంటనే రెస్టారెంట్ నిర్వాహకులు స్పంది ంచారు. ఇకపై వస్త్రధారణపై ఎలాంటి ఆం క్షలు పెట్టబోమని, రాఖీ పండుగ సందర్భంగా భారతీయ వస్త్రధారణలో వచ్చేవారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని, రాయితీలు కూ డా అందిస్తామని ప్రకటించారు.