న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 50 శాతం మేర పాజిటివ్ కేసులు పెరిగాయి. మంగళవారం 202 కేసులు నమోదు కాగా, బుధవారం కొత్తగా 299 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఢిల్లీలో కరోనా పాజిటివిటీ రేటు 2.9 శాతానికి పెరిగింది. అయితే ఎలాంటి కరోనా మరణాలు నమోదు కాలేదు. కాగా, ఢిల్లీలో కరోనా కేసుల పెరుగుదలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కరోనా పరిస్థితిని చాలా నిశితంగా గమనిస్తున్నామని తెలిపారు. ఆందోళన చెందాల్సిన పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగితే నియంత్రణకు అవసరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
మరోవైపు ఒమిక్రాన్ కొత్త వేరియంట్ నేపథ్యంలో దేశంలో మరోసారి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫోర్త్ వేవ్‌పై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.