న్యూఢిల్లీ: హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించిన భారత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు వివిధ మతాలకు చెందిన పెద్దలు ( Religious leaders ) ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్ దంపతుల భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. రెండు రోజుల క్రితం తమిళనాడులోని నీలగిరి కొండల్లో కూనూరు సమీపంలో మిలిటరీ హెలిక్యాప్టర్ కూలిపోయి మంటల్లో చిక్కుకుంది. ఈ ఘటనలో బిపిన్ రావత్ దంపతులు సహా మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు.
Delhi: Religious leaders hold multi-faith prayers as they pay their last respects to #CDSGeneralBipinRawat and his wife Madhulika Rawat. pic.twitter.com/GSydKvadz6
— ANI (@ANI) December 10, 2021