న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు ఎనిమిది నెలల గరిష్ఠానికి చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా 15,097 కేసులు నమోదయ్యాయి. బుధవారం 10,665 కేసులు నమోదు కాగా, గురువారం నాలుగు వేలకుపైగా కేసులు అదనంగా తోడయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 31,498కు, మొత్తం కరోనా కేసుల సంఖ్య 14,89,463కు పెరిగింది.
కరోనా పాజిటివ్ రేటు 4.49 శాతం పెరిగి 15.34 శాతానికి చేరింది. గురువారం కొత్తగా 1091 రోగులు ఆసుపత్రుల్లో అడ్మిట్ అయ్యారు. మరోవైపు గత 24 గంటల్లో ఢిల్లీలో ఆరుగురు కరోనాతో మరణించారు. దీంతో కరోనా మొత్తం మరణాల సంఖ్య 25,127కు చేరింది. ఇప్పటి వరకు 14,32,838 మంది కరోనా రోగులు కోలుకున్నారు.