న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా(Air India)కు చెందిన విమానాన్ని పక్షి ఢీకొన్నది. ఢిల్లీ నుంచి పుణె వెళ్తున్న విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. దీంతో ఆ విమానానికి చెందిన రిటర్న్ జర్నీని రద్దు చేశారు. ఢిల్లీ నుంచి పుణెకు విమానం బయలుదేరిన తర్వాత .. ఆ విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు సంస్థ తెలిపింది. అయితే పుణెలో దిగిన తర్వాత ఆ విమానాన్ని పక్షి ఢీకొన్నట్లు ద్రువీకరించామన్నారు. విమానాన్ని గ్రౌండ్ చేసిన తర్వాత చాలా విస్తృత స్థాయిలో చెకింగ్ చేశామని, ఇంజినీరింగ్ బృందం ఆ చర్యలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.
పక్షి ఢీకొన్న నేపథ్యంలో.. పుణె నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన ఫ్లయిట్ ఏఐ2470ని జూన్ 20వ తేదీన రద్దు చేసినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. పక్షి ఢీకొన్నా.. విమానం పుణెలో సురక్షితంగా ల్యాండైనట్లు తెలిపారు. అయితే స్తంభించిన ప్రయాణికుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎయిర్లైన్స్ సంస్థ తెలిపింది. రీఫండ్ లేదా క్యాన్సిలేషన్ లేదా కాంప్లిమెంటరీ రీషెడ్యూలింగ్ అవకాశం కల్పిస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.