న్యూఢిల్లీ: దేశ రాజధానిలో వాయు నాణ్యత పూర్తిగా దిగజారిపోవడంతో గ్రెడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్(గ్రాప్) మూడవ దశ కింద అత్యవసర ఆంక్షల్లో భాగంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు 50% మంది ఉద్యోగులతో మాత్రమే పనిచేయాలని, మిగిలిన ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఢిల్లీ ప్రభుత్వం సోమవారం ఆదేశించింది. ఢిల్లీలో వాయు కాలుష్యం క్షీణించడంతో ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేసింది.
మరో వైపు ఢిల్లీ కాలుష్యంపై ఆదివారం జరిగిన భారీ నిరసనల్లో మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ను నిరసిస్తూ నిరసనకారులు పోస్టర్లు ప్రదర్శించటం సంచలనంగా మారింది.