న్యూఢిల్లీ : సీజేపీ ఆధ్వర్యంలో జూలై 20న నిర్వహించిన పార్లమెంట్ మార్చ్‌లో నేర చరిత్ర కలిగిన వారు పాల్గొన్నారని ఢిల్లీ పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో 101 మంది హత్య కేసుల్లో, 284 మంది దొంగతనం కేసుల్లో, 92 మంది మహిళలు లేదా చిన్న పిల్లలపై లైంగిక వేధింపుల కేసుల్లో నిందితులుగా ఉన్న వారు పాల్గొన్నారని వెల్లడించాయి. పోలీసులపై దాడులు చేసి, వాహనాలను ధ్వంసం చేసిన వారిలో సీసీ ఫుటేజీ ఆధారంగా 2,873 మందిని గుర్తించామని.. ఇందులో 989 మంది నేర చరిత్ర కలిగిన వారేనని తెలిపాయి. హత్య కేసుల్లో నిందితులుగా ఉన్న 101 మందిలో 42 మందిపై రెండు లేదా అంతకంటే ఎక్కువ నేరపూరిత కేసులున్నట్టు పేర్కొన్నాయి.