న్యూఢిల్లీ, డిసెంబర్ 5: కేవలం రూ.50 లక్షలు చెల్లించి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ (ఏజేఎల్)కు చెందిన రూ.2 వేల కోట్ల ఆస్తులను కాంగ్రెస్ అగ్రనేతలు కొట్టేసిన నేషనల్ హెరాల్డ్ కేసులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు ఈవోడబ్ల్యూ నోటీసులు జారీ చేసింది. ఆర్థిక లావాదేవీలు, విషయాలపై ఆయన వివరణ కోరుతూ ఆర్థిక నేరాల విభాగం పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 19 లోగా వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇటీవల కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఢిల్లీ పోలీసులు కొత్త ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విషయం తెలిసిందే.
ఈ వ్యవహారంలో నగదు అక్రమ చెలామణి జరిగిందని ఈడీకి ఫిర్యాదులు అందాయి. ఈడీ ఇచ్చిన సమాచారంలో ఎఫ్ఐఆర్లో వారిపై నేరపూరిత కుట్ర సంబంధిత అభియోగాలు మోపారు. అభియోగాలు నమోదైన నేతలలో ఆస్కార్ ఫెర్నాండెజ్, సుమన్ దుబే, మోతీలాల్ వోరా, శ్యామ్ పిట్రోడా ఉన్నారు.