న్యూఢిల్లీ, జూలై 23: యువ నిరసనకారులపై పోలీసు అధికారాల దుర్వినియోగం జరిగిందంటూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఆరోపిస్తున్న నేపథ్యంలో కఠినమైన జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ) కింద ఢిల్లీ పోలీసులకు ఉన్న ముందస్తు నిర్బంధ అధికారాన్ని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరంజిత్ సందు అక్టోబర్ 18 వరకు పొడిగించారు. ఎన్ఎస్ఏలోని సెక్షన్ 3 ఉప సెక్షన్(2) కింద నివారణ చర్యగా ఎవరినైనా నిర్బంధించే అధికారాన్ని నగర పోలీసు కమిషనర్‌కు కల్పిస్తూ ఢిల్లీ ప్రభుత్వ హోం శాఖ జూలై 15న నోటిఫికేషన్ జారీచేసింది. ఈ అధికారాలు అక్టోబర్ 18 వరకు చెల్లుబాటు అవుతాయని నోటిఫికేషన్ పేర్కొంది.