Delhi Police dismissed | కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ మనీష్ మీనా తన ఉద్యోగాన్ని పోగొట్టుకున్నారు. నార్త్ డిస్ట్రిక్ట్ సబ్జీ మండి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న మనీశ్ మీనా.. కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఈ అంశం పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది.
దీనిపై స్పందించిన ఢిల్లీ పోలీసు శాఖ ఉన్నతాధికారులు ఉద్యోగం నుంచి ఆయన్ను తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. రాజ్యాంగంలోని 311 (2) (బీ) అధికరణం ప్రకారం ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు.. మనీశ్ మీనాపై చర్యలు తీసుకున్నారు. తనకు వ్యతిరేకంగా ఉన్నతాధికారులు చర్య తీసుకుంటారన్న సంకేతాలు రావడంతో కేంద్రానికి వ్యతిరేకంగా చేసిన ట్వీట్‌ను మనీశ్ మీనా సరిదిద్దుకున్నారని పోలీసు వర్గాల కథనం.