న్యూఢిల్లీ, అక్టోబర్ 27: క్రమశిక్షణ, నిబద్ధతతో కష్టపడితే ఏదైనా సాధించవచ్చునని ఢిల్లీకి చెందిన ఓ మహిళా పోలీస్ కానిస్టేబుల్ నిరూపించారు. 7నెలల గర్భిణి అయ్యిండి.. వెయిట్ లిఫ్టింగ్ పోటీలో పాల్గొనటమే గొప్ప. అలాంటిది అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 145 కిలోల బరువును ఎత్తి సోనికా యాదవ్ అందరితో శెభాష్ అనిపించుకున్నారు.
ఆంధప్రదేశ్‌లో జరుగుతున్న ‘ఆల్ ఇండియా పోలీస్ వెయిట్‌లిఫ్టింగ్ క్లస్టర్-2025’ పోటీల్లో ఆమె కాంస్య పతకాన్ని గెలుచుకున్నారు. పోటీలో 145 కిలోల బరువును డెడ్‌లిఫ్ట్ (బరువును కింది నుంచి పైకి లేపటం) చేశారు. మేలో సోనికా యాదవ్ గర్భం దాల్చిన సంగతి తెలియటంతో జిమ్‌కు వెళ్లటం, శిక్షణ ఆపేస్తుందని ఆమె భర్త భావించారు. 7నెలల గర్భంతో పోటీలో పాల్గొన్న ఆమె పతకం గెలుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు.