న్యూఢిల్లీ: వివిధ రాష్ర్టాల పోలీస్ సిబ్బందితో కలిసి చేపట్టిన సంయుక్త ఆపరేషన్ ద్వారా అల్‌ఖైదా ఉగ్ర కుట్రలను భగ్నం చేసినట్టు ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. జార్ఖండ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో దాడులు నిర్వహించి 11 మందిని అరెస్టు చేశామని, తద్వారా దేశంలో అల్‌ఖైదా పన్నిన ఉగ్ర దాడుల ప్రణాళికలను (టెర్రర్ మాడ్యూల్)ను ఛేదించామని ఢిల్లీ పోలీస్ గురువారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ నిందితుల నుంచి ఆయుధాలు, కీలక పత్రాలను స్వాధీనం చేసుకుందని, అలీగఢ్‌కు చెందిన మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకుందని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అల్‌ఖైదా టెర్రర్ మాడ్యూల్‌ను నిందితులు దేశంలో అమలుజేస్తున్నట్టు తెలిపారు.