న్యూఢిల్లీ: నర్మదా బచావో ఆందోళన్ నేత, సామాజిక కార్యకర్త మేధా పాట్కర్(Medha Patkar)ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఇటీవల ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయిన విషయం తెలిసిందే. 24 ఏళ్ల క్రితం నాటి పరువునష్టం కేసులో మేధా పాట్కర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ప్రొబేషన్ బాండ్లను ఆమె సమర్పించలేదు. 2000 సంవత్సరంలో పాట్కర్‌పై కేసు నమోదు అయ్యింది. అయితే బుధవారం ఢిల్లీ కోర్టు ఆ కేసులో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కేసులో రెండు వారాల పాటు స్టే ఇవ్వాలని పెట్టుకున్న పాట్కర్ అభ్యర్థనను కోర్టు కొ్ట్టివేసింది. గుజరాత్‌లోని ఓ ఎన్జీవో కు ఎల్జీ సక్సేనా అధినేతగా ఉన్న సమయంలో మేధా పాట్కార్ తీవ్ర ఆరోపణలు చేశారు. అతనో పిరికివాడు అని, హవాలా కుంభకోణానికి పాల్పడినట్లు మేధా పాట్కర్ ఆరోపించారు.