Atishi : ఢిల్లీ నూతన సీఎంగా అతీశి (Atishi) ఎన్నికవడంతో పలువురు నేతలు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. ఢిల్లీ ఆప్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన అతీశి ఇక ఢిల్లీ నూతన సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే అతీశి డమ్మీ సీఎం అని, అరవింద్ కేజ్రీవాల్ కనుసన్నల్లోనే ఆమె పాలన సాగిస్తారని బీజేపీ ఆరోపించింది. కాషాయ పార్టీ ఆరోపణలను ఢిల్లీ మంత్రి కైలాష్ గెహ్లాట్ తోసిపుచ్చారు. అతీశిని ఆప్ శాసనసభాపక్ష నేతగా, ఢిల్లీ తదుపరి సీఎంగా ఎమ్మెల్యేలందరూ ఏకగ్రీవంగా అంగీకరించారని పేర్కొన్నారు.
బీజేపీ చవకబారు విమర్శలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. కాగా, ఢిల్లీ సీఎంగా అతిశీ (Atishi) అద్భుతంగా పనిచేస్తారని తాను ఆశిస్తున్నానని, ఆమెకు అభినందనలు తెలియచేస్తున్నానని ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా పేర్కొన్నారు. పట్నాలో మంగళవారం మనోజ్ ఝా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ఢిల్లీ నూతన సీఎంగా పాలనా పగ్గాలు చేపట్టనున్న సందర్భంగా అతిశీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేసి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజా తీర్పును కోరతానని రెండ్రోజుల కిందట కేజ్రీవాల్ వెల్లడించారని, కేజ్రీవాల్ బాటలో అతిశీ మెరుగైన సామర్ధ్యం కనబరిచి తన పదవికి న్యాయం చేస్తారని తాను ఆశిస్తున్నానని చెప్పారు.కాగా, ఢిల్లీ తదుపరి సీఎం ఎవరన్నదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. అందరూ ఊహించినట్లే మంత్రి అతిశీ (Atishi)ని కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఖరారు చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది.
Read More :
SEC | రాష్ట్ర ఎన్నికల కమిషనర్గా రిటైర్డ్ ఐఏఎస్ రాణి కుముదిని