Crime news : ఆమె ఒక వ్యక్తిని వివాహం చేసుకుంది. అతడితో గొడవలు జరగడంతో విడాకులు తీసుకుంది. అతడితో కలిగిన సంతానంతో పుట్టింటికి వెళ్లింది. కొన్నాళ్ల తర్వాత ఓ యువకుడు పరిచయం కావడంతో అతడితో సహజీనం చేసింది. అయితే అతడు నిత్యం వేధించడంతో విడిచిపెట్టి మళ్లీ పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో ఆమెను తిరిగి తన దగ్గరకు రప్పించుకునేందుకు సదరు యువకుడు ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడు. బాధితురాలి ఫిర్యాదుతో కటకటాల వెనక్కి వెళ్లాడు.
వివరాల్లోకి వెళ్తే.. భర్తతో విడాకులు తీసుకుని ఏడేళ్ల కుమారుడితో పుట్టింట్లో ఉంటున్న మహిళ.. ఇటీవల అజయ్ వర్మ అనే 24 ఏళ్ల యువకడితో సహజీనం చేసింది. కానీ అతడు నిత్యం వేధింపులకు గురిచేస్తుండటంతో విడిచిపెట్టి మళ్లీ పుట్టింటికే వెళ్లింది. ఈ క్రమంలో మహిళను తిరిగి తన దగ్గరికి రప్పించుకోవాలనుకున్న అజయ్ వర్మ తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఆమె కొడుకును కిడ్నాప్ చేశాడు.
స్కూల్కు వెళ్లిన కొడుకు తిరిగి ఇంటికిరాకపోవడంతో బాధితురాలు వికాస్పురి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అజయ్ వర్మపై తనకు అనుమానం ఉన్నదని ఫిర్యాదులో పేర్కొన్నది. దాంతో అజయ్ వర్మ ఫోన్ ట్రాక్ చేసిన పోలీసులు.. ఓ తోటలో బాలుడితో కలిసి ఉన్న నిందితులను పట్టుకున్నారు. బాలుడిని క్షేమంగా విడిపించారు.