న్యూఢిల్లీ, జూన్ 10: దేశ రాజధాని న్యూఢిల్లీలో ఒక బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు. ద్వారకా ప్రాంతంలో ఉన్న ఈ భారీ భవనంలోని 8, 9 అంతస్తుల డూప్లెక్స్ ఫ్లాట్లో మంగళవారం ఉదయం మంటలు అంటుకున్నాయి.
ఎనిమిదో అంతస్తులో ఇంటి లోపల ఉన్న ఆలయం నుంచి మంటలు ప్రారంభమై అది 9వ అంతస్తుకు పాకాయి. దీంతో వాటిలో నివసిస్తున్న యాష్ యాదవ్ (41) అనే వ్యాపారి, అతని కుమార్తె ఆషిమా (12), మేనల్లుడు శివమ్ యాదవ్ (11) మంటల నుంచి తప్పించుకోవడానికి బాల్కనీ నుంచి దూకడంతో మృతి చెందారు.